Saturday, April 13, 2024

హైదరాబాద్‌కు చేరుకున్న ఎలిమెంటరీ లివింగ్‌

ఫర్నిచర్‌ పరంగా వినూత్నశైలి మాత్రమే కాదు ఆ ఫర్నిచర్‌ తమ ఇంటికి నూతన అందాలనందించాలని కోరుకుంటే ఎలిమెంటరీ లివింగ్‌ ఫర్నిచర్ అండ్ హోమ్‌ డెకార్‌ను సందర్శించాల్సిందే. ఎలిమెంటరీ లివింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రూనో, ప్యాలెస్‌ విండో, లీపాన్‌, వెస్ట్‌ విలేజ్‌ కలెక్షన్స్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈసంద‌ర్భంగా ఎలిమెంట‌రీ ఫౌండ‌ర్ ఆయుష్‌ బైద్ మాట్లాడుతూ… అసాధారణ శ్రేణితో కూడిన ఎలిమెంటరీ కలెక్షన్‌ ఇప్పుడు హైదరాబాద్‌ సహా భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టోర్లలోనూ లభిస్తుందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నామన్నారు. త‌మ‌ వినియోగదారులకు మహోన్నతమైన జీవనశైలిని ఎలిమెంటరీ లివింగ్‌ ఫర్నిచర్‌ శ్రేణితో అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. స్ఫూర్తిదాయక కలెక్షన్స్‌ను అన్వేషించేందుకు అందరినీ స్వాగతిస్తున్నామని ఆయ‌న తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement