Thursday, April 25, 2024

పెట్రో రేట్ల పెంపుతో క్యాబ్ లకు ఎఫెక్ట్..

ప్రభన్యూస్‌ : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల అన్ని వర్గాలకు శాపంగా మారుతోంది.. నగరంలో అన్నివర్గాలకు అందుబాటులో ఉన్న ప్రజా రవాణాలో భాగస్వామమైన క్యాబ్‌లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా తర్వాత రోడ్డుపైకి క్యాబ్‌లు వస్తున్నప్పటికి కరోనాకు ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. క్యాబ్‌ ట్రాన్స్‌పోర్టుకు ఆయువు పట్టుగా ఉన్న ఐటీ ఇండస్ట్రీ వర్క‌ ఫ్రమ్‌ హోం పద్దతిలో నిర్వహిస్తుండడంతో సగానికి పైగా క్యాబ్‌ రంగాన్ని దెబ్బతీసింది.

గత ఏడాదిన్నర కాలంగా వెంటాడిన కరోనా నుంచి హైదరాబాద్‌ మహానగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఓలా సంస్థ స్వయంగా మూడువేల లీజు వాహనాలను డ్రైవర్ల నుంచి జప్తు చేసుకుందని క్యాబ్‌ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. క్యాబ్‌లు తగ్గిపోవడంతో ఉన్న కొద్ది పాటి క్యాబ్‌ల యాజమానులు లెక్కాపత్రం లేకుండా ఇష్టా నుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement