Friday, March 29, 2024

హరితహారం పేరిట బృహత్‌ ప్రకృతి వనాల అభివృద్ధి : సీఎస్ సోమేశ్ కుమార్

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు హరితహారం పేరిట బృహత్‌ ప్రకృతి వనాలను అభివృద్ధి చేశామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఎస్కీ) ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు పర్యావరణ ప్రభావం అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎస్‌ మాట్లాడుతూ… దేశంలోని మిగతా రాష్ర్టాల కంటే వేగంగా తెలంగాణలో పచ్చదనం గణనీయంగా పెరిగిందన్నారు.

రాష్ట్రంలో 104 శాతం మేర వృక్ష సంపద పెరిగినట్టు ఇండియన్‌ స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ నివేదిక వెల్లడించిందని పేర్కొన్నారు. గ్రామాల్లోనూ పల్లె ప్రకృతి వనాల పేరిట ఎకరం విస్తీర్ణంలో పార్కులను అభివృద్ధి చేశామని వివరించారు. వాతావరణంలో వస్తున్న మార్పులు మానవాళికి సవాలుగా మారాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రకృతి పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని ఎస్కీ డైరెక్టర్‌ రామేశ్వర్‌రావు తెలిపారు. సదస్సులో ఐఈ సభ్యులు డాక్టర్‌ పీజీ శాస్త్రి, జీఎల్‌ రావు, జేసీ సింఘాల్‌, అనితా అగర్వాల్‌, ఎస్కీ ఫ్యాకల్టీ కేపీ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement