Tuesday, April 16, 2024

మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన‌ డెలివరూ సీఈఓ

డెలివరీ సీఈఓ విల్‌ షూ, మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లోని డెలివరూ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఐడీసీ)ని సందర్శించారు. ఈసంద‌ర్భంగా తెలంగాణా రాష్ట్ర ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, పురపాలక వ్యవహారాలు, నగరాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య (ఐ అండ్‌ సీ) శాఖ మంత్రి కె టి రామారావు, తెలంగాణా ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌, హైదరాబాద్‌ గారెత్‌ విన్‌ ఓవెన్ ల‌తో క‌లిసారు. అలాగే తన భారతదేశ సందర్శనలో భాగంగా, సీఈఓ విల్‌ షూ, పలువురు స్టేక్‌హోల్డర్లతో సమావేశమయ్యారు.

ఈసంద‌ర్భంగా డెలివరూ సీఈఓ, ఫౌండర్‌ విల్‌ షూ మాట్లాడుతూ… గత సంవత్సర కాలంలో డెలివరూ ఇండియా డెవలప్‌మెంట్‌ కేంద్రం సాధించిన విజయం పట్ల తాను సంతోషంగా ఉన్నానన్నారు. త‌మ గ్లోబల్‌ టెక్‌ ఆర్గనైజేషన్‌లో అత్యంత కీలకమైన భాగంగా ఇది నిలిచిందన్నారు. భారతదేశంలో త‌మ కార్యకలాపాలను మరింతగా 2023లో విస్తరించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు. దీంతో పాటుగా నిర్ణయాత్మక ఫుడ్‌ కంపెనీగా నిలువాలనే త‌మ లక్ష్యం చేరుకుంటూ ప్రపంచశ్రేణి బృందాన్ని నిర్మించనున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement