Thursday, April 25, 2024

ఎన్టీఆర్ విగ్రహం పేరుతో వసూళ్ల దందా.. అధికారపార్టీ నేతదే ఈ పాపం: లీడర్​

(ప్రభ న్యూస్, కుత్బుల్లాపూర్) : దివంగత నేత, మాజీ సీఎం.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం పేరుతో హైదరాబాద్లోని నిజాంపేట్​లో వసూళ్ల దందా నడుస్తోందని, దీనికి కార్పొరేషన్ కు చెందిన కొంతమంది నేతలే మూల కారణమని మల్కాజిగిరి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు లీడర్ నర్సింహారెడ్డి ఆరోపణల చేశారు. వారు వసూళ్లకు పాల్పడుతూ నిజాంపేట్ కార్పొరేషన్ లో ఓటు బ్యాంకు రాజకీయానికి తెరలేపారన్నారు. విగ్రహ దాతనైనా తాను వారించినా వినకుండా అధికార పార్టీకి పేరు వచ్చే రీతిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఈ వసూళ్ల దందా గురించి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ దృష్టికి ఇంకా రాలేకపోవచ్చని చెప్పారు . ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు కార్పొరేషన్ పరిధిలో ఘనంగా చేద్దామని నిర్ణయించుకుంటే టీఆర్ ఎస్ ఆ కార్యక్రమాన్ని హైజాక్ చేసిందని, ఇప్పటికే టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి ఈ వసూళ్ల దందా సమాచారం చేరిందన్నారు. దీంతో ఆయన ఆరా తీశారని త్వరలో చంద్రబాబును కలిసి వాస్తవ పరిస్థితులను అద్దం కట్టినట్లు వివరించడంతో పాటు త్వరలో పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ  మహానేత నందమూరి తారకరామారావు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

మచ్చలేని నాయకుడిగానే బతికా..

తనకు ఊహ వచ్చిన దగ్గరి నుండి టిడిపి పార్టీలోనే కొనసాగానని పార్లమెంట్ ఉపాధ్యక్షుడు లీడర్ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్య నేతలంతా వీడిపోయి.. నాయకులు లేని పార్టీగా చేసినా నెనున్నానని కొనసాగుతున్నట్లు తెలిపారు.  తన రాజకీయ జీవితంలో ఏనాడు చందాలు, పార్టీ ఫండ్ అంటూ వసూళ్లకు పాల్పడలేదని, మచ్చలేని రాజకీయ నాయకుడిగానే బతికానన్నారు. ఇప్పటికి నిజాంపేట్ లో ఏ గడపకైనా ఆపద వస్తే లీడర్ ఉన్నాడని తన ఇంటికి వస్తుంటారని గుర్తుకు చేశారు. అన్న నందమూరి రామారావు అభిమానిగా తన ఊపిరి ఉన్నంత వరకు ఇదే పార్టీలో కొనసాగుతాయి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement