Tuesday, April 23, 2024

అలసటగా ఉంటే బండి నడపకండి: సైబరాబాద్ పోలీసులు

ద్విచక్రవాహనదారులకు సైబరాబాద్ పోలీసులు కీలక సూచన చేశారు. వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులతో పాటు కుటుంబసభ్యులు చెప్తుంటారు. అతివేగం ప్రమాదకరం, హెల్మెట్ లేని ప్రయాణం చేయవద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నా కొందరు పెడచెవిన పెడుతుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే మన కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంటుందని తెలిసినా కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుంటారు. బుధవారం హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లైఓవర్‌పై ఓ వ్యక్తి నిద్రపోతూ వాహనం నడిపి ప్రమాదానికి గురై ప్రాణాలనే కోల్పోయాడు.

ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘నిద్ర లేకపోవడం, అలసటగా ఉంటే బండి నడపకండి. రాత్రంతా లారీని డ్రైవింగ్ చేసి తగిన విశ్రాంతి తీసుకోకుండా బైక్ నడుపుతూ ఓ వ్యక్తి చనిపోయాడు’ అంటూ వారు పేర్కొన్నారు. అందువల్ల వాహనం నడిపేటప్పుడు అజాగ్రత్తగా ఉండకుండా ప్రాణాలను కాపాడుకోండి.

ఈ వార్త కూడా చదవండి: యాదాద్రిలో విరిగిపడ్డ కొండచరియలు… తప్పిన ప్రమాదం

Advertisement

తాజా వార్తలు

Advertisement