Thursday, December 7, 2023

Covid Update : దేశంలో త‌గ్గుతున్న క‌రోనా కేసులు… కొత్త‌గా ఎన్నంటే..?

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తుంది. నాలుగు రోజుల క్రితం ఒక్క‌రోజే రెండు వేలు న‌మోదైన కేసులు మ‌ళ్లీ త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త మూడు రోజులుగా వెయ్యి వ‌ర‌కు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,190 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,55,828కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,243 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 1,375 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,452కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుండ‌డం కొంత ఆందోళ‌న‌కు గురిచేస్తుంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement