Thursday, April 25, 2024

ప్రైవేటు హాస్ప‌ట‌ల్స్ లో వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్న‌ల్..

హైదరాబాద్‌, ప్రైవేటు ఆసుపత్రులు 45ఏళ్ల పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 45ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే టీకా డోస్‌లను వ్యాక్సిన్‌ కంపెనీల నుంచి కొనుగోలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 18-44 ఏళ్ల వారికి టీకా ఇచ్చేందుకు అనుమతులను త్వరలోనే చెెబుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌, వ్యాక్సినేషన్‌ ఇన్‌చార్జి డా. జీ. శ్రీనివాసరావు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల్లో కోవిన్‌ సాఫ్ట్‌ వేర్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే టీకా ఇస్తామని స్పష్టం చేశారు. నేరుగా టీకా కేంద్రానికి వస్తే వ్యాక్సిన్‌ ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
ఎంజీఎంలో ఓపీ సేవలు నిలిపివేత…
కరోనా సెకండ్‌వేవ్‌ వేగంగా వ్యాపిస్తుండడంతో ఉత్తర తెలంగాణకు కీలకమైన ఎంజీఎంలో ఓపీ సేవలను నేటి నిలిపివేశారు. సాధారణ వార్డులో ఎమర్జెన్సీ రోగులకు సేవలు అందుతాయని ఆసుపత్రి సూపరిండెంట్‌ ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement