Tuesday, May 18, 2021

మ‌ళ్లీ వ‌ల‌స బాట – ఖాళీ అవుతున్న భాగ్య‌న‌గ‌రం

హైదరాబాద్‌, : ఏడాది గిర్రున తిరిగింది. కరోనా భూతం మళ్ళీ అప్పటిలాగే వణికిస్తోంది. కరోనా 2.0 మరింత వేగంగా విజృంభిస్తోంది. కరోనా ఉదృతి.. ఇతర రాష్ట్రాల్లో విధిస్తున్న లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూల నేపథ్యంలో హైద రాబాద్‌కు వలస వచ్చిన కార్మికులు పెద్ద ఎత్తున సొంత గ్రా మాలకు తరలివెళ్తున్నారు. బస్సులు, రైళ్ళు, ఇతర వాహ నాలను ఆశ్రయిస్తూ.. గ్రామాలకు తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళి పోతున్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ ప్రకటించిన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ వలస కార్మికులు.. వాటిని గురు ్తచేసుకుంటూ ముందే సర్దేసుకుంటున్నారు. దీంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుండగా, అదన పు అడ్వాన్స్‌ లు.. బోనస్‌లు ఇస్తామన్నా ఉండేందుకు ససేమిరా అంటు న్నారు. వలస కార్మికులను గత ఏడాది తీవ్ర నిర్లక్ష్యంతో వదిలే యగా.. సొంత గ్రామాలకు చేరేందుకు వందల కిలో మీటర్లు నడుస్తూ అనేక మంది మృత్యువాతపడ్డారు. లాక్‌ డౌన్‌లు ఎత్తివేసిన తర్వాత కార్మికులను తిరిగి తెచ్చుకునేందు కు నిర్మా ణసంస్థలు, పరిశ్రమల యాజమానులు తీవ్రంగా ఇబ్బం దులు పడాల్సి వచ్చింది. ఆర్ధికపరిస్థితి అతలా కుతలమైంది. సంస్ధలు, వ్యక్తులు చితికిపోయారు. ఇపుడిపుడే కోలుకుం టున్న దశలో మళ్ళీ.. సెకండ్‌వేవ్‌ హడలెత్తిస్తోంది. దీంతో ప్రతి రోజూ.. లక్షలమంది కార్మికులు.. హైదరాబాద్‌ నుండి ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇతర రాష్ట్రాల వా రే కాకుం డా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు కూడా జాగ్ర త్త పడు తున్నారు. ఉపాధి కోసం వచ్చిన వారు మళ్ళీ పల్లెల వైపు చూస్తున్నారు.
ఖాళీ అవుతున్న సిటీ
ఓవైపు కరోనా విజృంభిస్తుండగా, ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడంతో గత ఏడాదిని మించిన వేగంగా కరోనా విస్తరిస్తోంది. విస్తరిస్తున్న కరోనా.. బెడ్లు ఖాళీలేని పరిస్థితులు ఏర్పడుతుండగా, వలస కార్మికులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా నిర్వహించలేదు. ఉత్పత్తి, ఉత్పాదకతల్లో కీలకంగా వ్యవహరించే వలస కార్మికులను వ్యాక్సినేషన్‌ విషయం లో నూ నిర్లక్ష్యం చేయడంతో.. వారు బెంబేలెత్తుతున్నారు. పారి శ్రామిక, నిర్మాణరంగంతో పాటు అన్నిరంగాలపై.. ఈ వలస కార్మికుల ఎఫెక్ట్‌ పడనుంది. గత అనుభవాల నేపథ్యంలో.. కొన్ని యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుండగా, పెద్ద సంస్థలు వ్యాక్సినేషన్‌ చేయిస్తామని.. భయపడవద్దని భరోసానిస్తున్నాయి. అయినా వేలమంది సొంతూళ్ళకు వెళ్ళేందుకే మొగ్గు చూపుతున్నారు. ఆర్టీసి బస్టాండ్లు, సికిం ద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తో పాటు ప్రయాణికుల ప్రాంగణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. కోవిడ్‌పై యుద్దప్రాతిపదికన ప్రభు త్వాలు చర్యలు తీసుకుంటున్నా, టెస్ట్‌ల సంఖ్య భారీగా పెం చినా వలస కార్మికులను ఇవి నిలువరించలేకపోతు న్నాయి. గతంలో ఈ తరహా అనుభవాలను చూసిన వలస కార్మికులు.. లాక్‌డౌన్‌ ఉండదని చెప్పినా వినే పరిస్థితిలో లేరు. తమ అంచ నాలు, అనుభవాలతో.. సొంతదారి చూసుకుంటున్నారు. లాక్‌ డౌన్‌ లేకున్నా.. ఆర్ధికరంగంపై ఈ వలసలు, కరోనా విజృంభణ తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. మళ్ళీ మొత్తం వ్యవస్థ కుదే లుకానుంది. చాలా రంగాలు.. రెండోసారి దెబ్బ తగిలితే కోలుకోవడం కష్టమేనని ఆర్ధికరంగ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News