Tuesday, May 30, 2023

సీఎం సహాయ నిధి పేదలకు వరం.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా

సీఎం సహాయ నిధి పేదలకు వరమని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. మంగళవారం హైదరాబాద్, నాగోల్ లోని తన క్యాంప్ కార్యాలయంలో.. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం, దుప్పల పల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన జి.వేణు తండ్రి కోటయ్య కు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.33,000ల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలా మారిందని, ఎంతో మంది నిరుపేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందుతోందన్నారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేని పేద ప్రజలందరూ సీఎం రిలీఫ్ ఫండ్ సేవలను వినియోగించుకోవాలన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement