Sunday, October 13, 2024

TG | సీఎం రేవంత్ అధ్య‌క్ష‌త‌న‌ సీఎల్పీ భేటీ.. !

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) సమావేశం జరిగింది. నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించినప్పుడు సీఎల్పీ సమావేశం నిర్వహించడం ఆనవాయితీ… కాగా, మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించనున్నారు.

రాష్ట్ర రాజకీయాలు, బీసీ జనాభా లెక్కలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీఏసీ చైర్మన్‌ ఆరెకపూడి గాంధీ, దానా నాగేందర్‌, ప్రకాశ్‌గౌడ్‌, కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement