Friday, April 19, 2024

పరిశుభ్రతతోనే రోగాలు దూరం..

నల్లకుంట : పరిశుభ్రతతోనే ప్రజలు రోగాల బారినపడకుండా ఉంటారని, మన చుట్టు ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నల్లకుంట కార్పొరేటర్‌ వై. అమృత సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిహెచ్‌ఎంసి ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో డివిజన్‌లోని రత్నానగర్‌, సత్యానగర్‌ బస్తీలలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మలేరియా దోమల వల్ల వస్తుందని మన చుట్టు ఉన్న పరిసరాలలో చెత్త చెదారం చేరకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు చేరే అవకాశం ఉండదన్నారు. ప్రతి ఒక్కరు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే మన పరిసరాలు, మన వీధులు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నరేందర్‌రెడ్డి, స్థానిక నాయకులు మహేశ్‌, లక్ష్మణ్‌, ఈశ్వర్‌, కిశోర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement