Monday, October 14, 2024

న్యూయార్క్ సిటీ మేయర్ తో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి భేటీ

నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గుడ్ విల్ లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తో మంగళవారం భేటీ అయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ జనవరి 30న 75వ వర్ధంతి సందర్భంగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి న్యూయార్క్ సిటీ హాల్ లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ… హైదరాబాద్ నగరం పురాతన కాలం నుండి నేటికీ ప్రసిద్ధి చెందడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు గ్లోబల్ సిటీ గా రూపాంతరం చెందుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందుతుందన్నారు.

ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ…  హైదరాబాద్ నగరం సిస్టర్ సిటీ రిలేషన్ షిప్ ద్వారా భౌతికంగా అభివృద్ధి చెందిన సిటీలతో పరస్పర సహకారం, బిజినెస్ లో అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఇంతకుముందు కాలిఫోర్నియా సిటీ హైదరాబాద్ నగరంతో సిస్టర్ సిటీ రిలేషన్ షిప్ ఎం.ఓ.యు ఒప్పందం చేసుకొని ఇరు నగరాలకు సంబంధించిన సంస్కృతి, అకాడమీ పరంగా, పరస్పర అవకాశాలపై  సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. న్యూయార్క్ నగర  మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఏప్రిల్ 30లోపు హైదరాబాద్ నగరానికి విచ్చేసి హైదరాబాద్ నగరాన్ని వీక్షించాలని, ఇక్కడ అభివృద్ధి చెందిన ప్రదేశాలను, సిస్టర్ సిటీ రిలేషన్ షిప్ లో భాగంగా చేసుకున్న ఎం.ఓ.యు ప్రకారం టెక్నాలజీ, ఇతర పరస్పర మార్పిడి ఒప్పందం చేసుకోవాలని గద్వాల్ విజయలక్ష్మి  న్యూయార్క్ మేయర్ ను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement