Thursday, April 25, 2024

ఆన్‌లైన్ భద్రత పై అవగాహన పెంచేందుకు సెర్ట్ ఇన్, కూ యాప్ టై అప్

భారతదేశం బహుళ-భాషా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ – కూ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం రోజున‌ పౌరసత్వానికి సంబంధించిన కార్యక్రమం సందర్భంగా చేతులు కలిపాయి. ఈసంద‌ర్భంగా కూ ప్రతినిధి మాట్లాడుతూ… భారతీయులు స్థానిక భాషల్లో తమను తాము ఆన్‌లైన్‌లో వ్యక్తీకరించడానికి వీలు కల్పించే బహుళ-భాషా వేదికగా, ఇంటర్నెట్ భద్రత, బాధ్యతాయుతమైన వినియోగదారు ప్రవర్తనను ప్రోత్సహించడంలో కూ ముందంజలో ఉందన్నారు.

ఆన్‌లైన్ బెదిరింపు, దుర్మార్గాన్ని అరికట్టడానికి, ఆరోగ్యకరమైన కంటెంట్‌ను రూపొందించడానికి, అర్థవంతమైన సంభాషణలను నిర్వహించడానికి వినియోగదారులను ప్రోత్సహించడానికి తాము బలమైన విధానాలను కలిగి ఉన్నామన్నారు. ఇంటర్నెట్‌ను మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ఈ సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవంలో సెర్ట్ తో అనుబంధం కలిగి ఉన్నందుకు తాము సంతోషిస్తున్నామని తెలిపారు. ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది సైబర్ సెక్యూరిటీ సంఘటనలకు ప్రతిస్పందించడానికి గల జాతీయ నోడల్ ఏజెన్సీ అన్నారు. ఈ సెర్ట్ ఇన్, కూ సైబర్ సెక్యూరిటీ అవగాహనను సృష్టించడం, ఆన్‌లైన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఇంటర్నెట్ వినియోగదారులకు అవగాహన కల్పించడమ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement