Wednesday, April 24, 2024

Breaking : హ‌బ్సిగూడ‌లో కారు బీభ‌త్సం..

హైద‌రాబాద్ : నగరంలోని హబ్సిగూడలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వ‌చ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవ‌ర్ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు. అనంత‌రం క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ యువ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement