Thursday, April 18, 2024

ట్యాంక్‌ బండ్‌పై కారు బోల్తా, తప్పిన ప్రమాదం

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్ వ‌ద్ద పెను ప్ర‌మాదం త‌ప్పింది. సోమ‌వారం ఉద‌యం ఖైర‌తాబాద్ నుంచి తెలుగు త‌ల్లి ఫ్లైఓవ‌ర్ వైపు వ‌స్తున్న కారు ఎన్టీఆర్ ఘాట్ స‌మీపంలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొని బోల్తా ప‌డింది. ఈ ఘటనలో కారులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. క్ష‌త‌గాత్రుల‌ను సమీపంలోని ఆస్పత్రికి త‌ర‌లించారు. కాగా క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement