Thursday, March 23, 2023

ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ ను ప్రారంభించిన బ్లాక్‌బెర్రీ

బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌ నేడు నూతన బ్లాక్‌బెర్రీ ఐఓటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, ఇంజినీరింగ్‌, ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని భారతదేశంలోని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈసంద‌ర్భంగా బ్లాక్‌బెర్రీ ఐఓటీ ప్రెసిడెంట్‌ మత్తియాస్‌ ఎరిక్‌సన్‌ మాట్లాడుతూ… నైపుణ్యాలు, ఆవిష్కరణలలో కొనసాగుతున్న బ్లాక్‌బెర్రీ ప్రస్తుత పెట్టుబడుల్లో నేడు మరో మైలురాయిని చేరుకున్నామన్నారు. ఇది ప్రపంచశ్రేణి సాఫ్ట్‌వేర్‌ ఇన్నోవేటర్లకు నిలయంగా ఇండియా ప్రాధాన్యతను వెల్లడిస్తుందన్నారు. బ్లాక్‌బెర్రీ ఐఓటీ అంతర్జాతీయ ఆవిష్కరణ నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌లో విస్తరించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు.

- Advertisement -
   

ఇది వినియోగదారులు, భాగస్వాములకు సేవలను అందించడంలో త‌మ నిబద్ధతను వెల్లడించడంతో పాటుగా ఐఓటీ సాఫ్ట్‌వేర్‌ లీడర్‌గా త‌మ వృద్ధిని మరింత వేగవంతం చేయనుందన్నారు. ఆటోమోటివ్‌, ఐఓటీ రంగాల్లోని స్థానిక, అంతర్జాతీయ తయారీదారులకు అత్యంత కీలకమైన మార్కెట్‌గా ఇండియా నిలుస్తుందన్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్‌ ప్రతిభావంతుల కారణంగా కీలకంగా నిలుస్తుందన్నారు. ఈ కేంద్రం, బ్లాక్‌బెర్రీ ఐఓటీ, భారతదేశంలో త‌మ వినియోగదారులు, భాగస్వాములతో అతి సన్నిహితంగా సహ అభివృద్ధి, సహ ఆవిష్కరణలు చేసేందుకు బ్లాక్‌బెర్రీకి తోడ్పడనుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement