Tuesday, April 16, 2024

Big Breaking : BRSగా మారిన TRS.. బీఆర్ఎస్ ప‌త్రాల‌పై సంత‌కం చేసిన సీఎం కేసీఆర్..

తెలంగాణ భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 1.20 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భార‌త రాష్ట్ర స‌మితి ప‌త్రాల‌పై సంత‌కం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు జేడీఎస్ చీఫ్ కుమార‌స్వామి, న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం బీఆర్ఎస్ కండువాను కేసీఆర్ ధ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయ‌కులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. పార్టీ ప్రస్థానంలో సరికొత్త చరిత్ర అని ప్రముఖులు తమ అభిప్రమాయాన్ని వ్యక్తం చేశారు. ఈసీకి కేసీఆర్‌ సంతకం చేసిన లేఖను పంపనున్నారు. ఆ తర్వాత ఈసీ నుంచి నోటిఫికేషన్ రానుంది. గులాబీ జెండా మధ్యలో భారత దేశం మ్యాప్ (చిత్రం) ఉంటుంది. పార్టీ పేరు మారినా కారు గుర్తు మాత్రం కొనసాగనుంది. అనంతరం తెలంగాణ భవన్‌ ముందు బీఆర్‌ఎస్‌ జెండాను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement