హైదరాబాద్: నల్గొండ ఉప ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు టిఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి నోముల భగత్ ముఖ్యమంత్రి కెసిర్ కు కృతజ్ఞతలు తెలిపారు.. టిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ చేతుల మీదుగా బి ఫామ్ అందుకున్న భగత్ మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తనకు ఈ అవకాశం ఇస్తారని ఊహించలేదని అన్నారు.. కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు నోముల నర్సింహాయ్య ఏం చేసారన్నది ప్రజలకు తెలుసన్నారు. ‘నాగార్జునసాగర్‌లో మాకు ఎవరూ పోటీ కాదు, మాకు మేమే పోటీ’’ అని భగత్ ప్రకటించారు. మంగళవారం నామినేషన్ వేసిన అనంతరం అందరిని కలుపుకుని ప్రచారాన్ని కొనసాగిస్తానని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement