Friday, March 29, 2024

బండి సంజయ్ ని అరెస్ట్ చేయాలి : రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. మహిళ అనే గౌరవం లేకుండా నువ్వు మాట్లాడిన తీరు యావత్తు మహిళా లోకాన్ని అవమానించేలా ఉంద‌న్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళలపై ఆయనకి, బీజేపీ పార్టీకి ఉన్న గౌరవం మర్యాద ఎంటో తెలియజేస్తున్నద‌న్నారు. కవితను అవమానించిన బండి సంజయ్ ని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింద‌న్నారు. మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నద‌న్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు దురుద్దేశపూర్వకంగా మహిళా బిల్లును తొక్కిపెట్టింద‌న్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అడిగినందుకు కేసులతో వేధిస్తున్నద‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నద‌న్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కానీ అవగాహన లేని బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నార‌ని, బీజేపీ అధినాయకత్వం కుట్ర పూరితంగా కవితపై కేసు పెట్టినా పారిపోకుండా ధైర్యంగా విచారణ ఎదుర్కొంటున్నార‌న్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన బీజేపీ బ్రోకర్లు, వారి వెనకాల ఉన్న బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నార‌ని మండిప‌డ్డారు. కానీ కవిత మాత్రం ఏ తప్పు చేయకున్నా.. ధీరవనితలు రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయిలా ధైర్యసాహసాలతో పోరాడుతున్నార‌న్నారు. అలాంటి వీర వనిత గురించి నీచంగా మాట్లాడిన బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement