Saturday, March 25, 2023

బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆర్యవైశ్యులకు గౌరవం : ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్యులకు గౌరవం దక్కిందని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ లోని శరటన్ హోటల్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్-ఐవీఎఫ్‌ నేషనల్ ప్రెసిడెంట్ అశోక్ అగర్వాల్, ఐవీఎఫ్‌ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్రువదాస్ అగర్వాల్ పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తాతో కలిసి, మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేశారు.

- Advertisement -
   

ఈ సందర్భంగా ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… ముఖ్యంగా ఆర్యవైశ్యులకు నలుగురుకి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు, 11 మందికి మున్సిపల్ చైర్మన్ పదవులు, ఒకరికి ఎమ్మెల్సీ పదవి, ఒకరికి ఎమ్మెల్యే పదవి, మరొకరికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కూడా అవకాశం దక్కిందన్నారు. ఆర్యవైశ్య జాతికి గుర్తింపు, గౌరవం దక్కిందన్నారు. ఆర్యవైశ్యులను గతంలో ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాముఖ్యత ఎవరూ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్యులను గుర్తించి, వారికి ప్రాముఖ్యత ఇచ్చిందన్నారు. న్యాయం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో.. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, ట్రెజరర్ గౌరి శంకర్, ఐవీఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి శ్రీనివాస్ గుప్తా, ఐవీఎఫ్-సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు బెలిద నర్సింహ, ఐవీఎఫ్ -యూత్ విభాగం నరేష్ గుప్తా, సుధాకర్, ఐవీఎఫ్ -తెలంగాణ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement