Saturday, May 21, 2022

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన న‌టుడు స‌మీర్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో నటుడు సమీర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సమీర్‌ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం నటులు శ్రీకాంత్‌, సన, జీవిత, రాజశేఖర్‌లకు ఛాలెంజ్‌ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement