Thursday, April 25, 2024

‘మా’ ఎన్నికల్లో ట్విస్ట్.. పోటీ నుంచి తప్పుకున్న సీవీఎల్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మరో కీలక పరిణామాం చోటుచేసుకుంది. ‘మా’ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. ‘మా’ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.  ‘మా’ పదవుల కంటే ‘మా’ సభ్యుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తానని సీవీఎల్ స్పష్టం చేశారు. అయితే మా అధ్యక్ష పదవి కోసం సీవీఎల్ పోటీ చేయాలని భావించారు. ఈ రోజు ఉదయమే మ్యానిఫెస్టో ప్రకటించిన సీవీఎల్.. అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో చర్చనీయాంశంగా మారాయి.  ఇప్పటికే జీవిత, హేమలు పోటీ నుంచి తప్పుకొని ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరిన సంగతి తెలిసిందే. ఇక  ప్రధాన కార్యదర్శి రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన నటుడు బండ్ల గణేష్.. ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపాడు. తాజాగా సీవీఎల్ నరసింహారావు కూడా బరిలో నుంచి తప్పుకోవడంతో ప్రకాష్‌ రాజ్, విష్ణు ప్యానల్ మధ్య ప్రధాన పోటీ జరగనుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఈ నెల 10న జరగనున్నాయి.

ఇది కూడా చదవండిః ‘వరుడు కావలెను’ సాంగ్ రిలీజ్!

Advertisement

తాజా వార్తలు

Advertisement