Saturday, April 20, 2024

డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎంపీ రంజిత్ రెడ్డి

డ్రైనేజీ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపుతామ‌ని చేవెళ్ల పార్ల‌మెంట్ స‌భ్యులు డా.జి.రంజిత్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ డివిజన్, ఆదిత్య నగరలో సుమారు 50వేల జనాభా కలిగిన బస్తీలో ఇప్పటికే జి.హెచ్.ఎం.సి ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 90శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఆదిత్య నగర్ బస్తి హాఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ అనుకొని ఉండడం వల్ల రైల్వే పరిధిలో నుంచి డ్రైనేజీ ఔట్ లెట్ నిర్మాణం చేపట్టి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేకపూడి గాంధీ, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం మాల్యా దృష్టికి డ్రైనేజీ ఔటలేట్ నిర్మాణం విషయం తీసుకువెళ్లారన్నారు.

మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్. ఈరోజు స్థానిక కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ అధీనంలో ఉన్న స్థలంలో నుంచి నూతనంగా నిర్మించాల్సిన డ్రైనేజీ ఔటలేట్, బస్తీలో చేపటాల్సిన అభివృద్ధి పనులను స్థానిక బస్తీ నాయకులతో కలిసి స్వయంగా పరిశీలించారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఈ.ఈ శ్రీకాంతి, డి.ఈ స్రవంతి, ఏ.ఈ ప్రశాంత్, హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి మేనేజర్ ఇల్వర్తి, ఇతర డిపార్ట్ మెంట్ అధికారులు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, నల్ల సంజీవ రెడ్డి, సయ్యద్ గౌస్, సర్వర్, సుభాష్ చంద్రబోస్ నగర్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షులు ముక్తర్, కృష్ణ కాలనీ టిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు కృష్ణ యాదవ్, మాదాపూర్ డివిజన్ మైనారిటీ అధ్యక్షులు రహీం, నాయకులు ఖాసీం, లియకత్, బాబూమియా, సలీం, మియన్, మాదాపూర్ డివిజన్ యూత్ అధ్యక్షులు షైక్ ఖాజా, ఆదిత్య నగర్ యూత్ అధ్యక్షులు మొహమ్మద్ ఖాజా, మహమ్మద్, బాషరత్, ఇమ్రాన్, నర్సింహ, మహిళలు ఉమాదేవి, రాణి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement