Wednesday, May 19, 2021

66 ఎకరాలు మంత్రి ఈటల కబ్జా – నిగ్గు తేల్చిన విచారణ కమిటీ

హైదరాబాద్:  మంత్రి ఈటల 66 ఎకరాలు కబ్జా చేసినట్లు విచారణ కమిటీ తేల్చింది. ఈ మేరకు 6 పేజీల నివేదికను సీఎస్ సోమేశ్ కుమార్‌కు మెదక్ కలెక్టర్ హరీష్ పంపారు . రోడ్ వైడెనింగ్‌లో భాగంగా చాలా చెట్లను నరికివేసినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీనిపై కూడా సీఎస్‌కు కలెక్టర్ హరీష్ నివేదికను సమర్పించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో అసైన్డ్ భూములను మంత్రి ఈటల కబ్జా చేశారని సీఎం కేసీఆర్‌కు స్థానిక రైతులు లేఖ రాశారు. దీంతో కేసీఆర్ విచారణకు ఆదేశించారు. అచ్చంపేటలో నేడు కమిటీ చేపట్టిన విచారణలో మంత్రి ఈటలపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News