Thursday, December 5, 2024

18న క‌రీంన‌గ‌ర్ జిల్లా అభిమానులతో‌ ష‌ర్మిల‌ ఆత్మీయ సమ్మేళ‌నం

‌హైదరాబాద్‌, : ఈ నెల 18న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అభిమానులతో వైయస్‌ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిం చనున్నారు. ఈ వివ‌రాల‌ను షర్మిల మద్దతుదారు ఇందిరాశోభన్ లోటస్‌పాండ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు. కరీంనగర్‌ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను అభిమానుల నుంచి షర్మిల తెలుసుకుంటారని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అభిమానులు ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 30 వరకు ఖమ్మం మినహా అన్ని జిల్లాల ఆత్మీయ సమావేశాలను పూర్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా మన్నారు. దీనికి సంబంధించి ముందు రెండు రెండు జిల్లాలను కలిపి సమ్మేళనాలను ఏర్పా టుచేయాలని యోచించగా, అభిమా నులు జిల్లాల వారీగా జరపాలని కోరడంతో వారి విజ్ఞప్తి మేరకు జిల్లాల వారీగా జరుపుతున్నట్టు స్పష్టం చేశారు. కరీంనగర్‌ సమ్మేళనం అనం తరం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల ఆత్మీయ సమ్మేళనాలుంటాయని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో షర్మిల ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ముఖ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement