Thursday, March 28, 2024

డ్రైనేజి,మంచినీటి సమస్యలు పరిష్కరిస్తా..

కవాడిగూడ : కవాడిగూడ డివిజన్‌లలోని వివిధ బస్తీలలో డ్రైనేజి, మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కవాడిగూడ డివిజన్‌ కార్పోరేటర్‌ జి రచనశ్రీ వాటర్‌వర్స్క్‌ అధికారులకు సూచించారు. ఇంటింటికి కార్పోరేటర్‌ కార్యక్రమం లో భాగంగా డివిజన్‌లోని బండమైసమ్మనగర్‌ బస్తీలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బస్తీవాసులు, మహిళలు, గత కొన్ని నె లలుగా డ్రై నేజి పొంగిపోర్లుతుందని, తాగునీటిలో కలుషిత నీరు సరఫరా జరుగుతుందని పిర్యాదు చేయగా తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బండమైసమ్మనగర్‌లో డ్రైనేజీ, మంచినీటి సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆదే విధంగా డివిజన్లోని వివిధ బస్తీలలో డ్రైనేజి, కలుషితనీటి సరఫరా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే పెరిగిన జనాభాకనుగుణం గా ఆయా బస్తీలలో నూతన పైప్‌లైన్‌లు వేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. బస్తీలలోని సమస్యలను ప్రజలు తన దృష్టికి తెస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు కె పరిమళ్‌కుమార్‌, జి వెంకటేష్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement