Tuesday, April 23, 2024

అన్నమయ్య సంకీర్తనలకు బ్రాండ్ అంబాసిడర్ శోభారాజు

అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ శోభారాజు అని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అధ్యక్షులు లావు అంజ‌య్య చౌద‌రి తెలిపారు. తానా అధ్యక్షులు ఈరోజు అన్నమయ్యపురంను సందర్శించారు. అన్నమయ్యపుర దేవాలయంలో ఒకే గర్భంలో కోలువై వున్న అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వాములను దర్శించి ఆశీస్సులందుకున్నారు. అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు సమర్పించిన సంకీర్తనలు విని, వారిని ఎంతగానో ప్రశంసించి, ఆశీర్వదించారు. అన్నమాచార్య సంకీర్తనలకు బ్రాండ్ అంబాసిడర్ శోభారాజు చేసిన విశేష సేవలను అంజయ్య చౌదరి చాలా ప్రశంసించి, వారి ప్రయత్నాలకు తానా సహకారముంటుందని చెప్పారు. లావు అంజయ్య చౌదరి తానా అధ్యక్షులుగానే కాకుండా అనేక సంఘాల్లో సభ్యులై మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని శోభారాజు అన్నారు. అన్నమాచార్య భావనా వాహిని పక్షాన లావు అంజయ్య చౌదరిని సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement