Thursday, December 5, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ కు స‌ర్వం సిద్ధం..

హైదరాబాద్‌, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ స్థానంలో 71మంది అభ్యర్థులు బరిలో ఉండగా, మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానంలో 93 మంది అభ్యర్థులు తుది బరిలో ఉన్నారు. కోవిడ్‌ నియంత్రణలతో పఠిష్ట భద్రత నడుమ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో విధిగా భౌతిక దూరంతోపాటు, మాస్కు తప్పనిసరి చేశారు. పోలింగ్‌ బూత్‌లోకి పెన్నులు, సెల్‌ఫోన్లను నిషేధించారు. గత నెల 16న నోటిఫికేషన్‌ జారీ కాగా, 23తో నామినేషన్లు ముగి శాయి. 24న నామినేషన్లను పరిశీలించిన అధికారులు 26 వరకు ఉపసంహరణలకు గడువిచ్చారు. ఇంకా ఎన్నికలకు 48 గంటల సమయమే ఉండటంతో ప్రచారం నిషేధించారు. దీంతో ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో సైలెన్స్‌ పీరియడ్‌ ఆరంభమైంది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి సా యంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల్ల ఓటర్ల ప్రలోభాలపై ఈసీ నిఘా పెంచింది. ఓట్ల లెక్కింపును 17న జరపనున్నారు. ఈనెల 22 వరకు కోడ్‌ కొనసాగనుంది. అప్పటి వరకు ప్రభుత్వ పథకాలు, కొత్త పథకాల ప్రకటనలపై నిషేధం అమలులో ఉండనుంది. అయితే బడ్జెట్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోరనుంది.
రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సర్వం సిద్దం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు 24 గంటలే మిగిలి ఉండటంతో పోలింగ్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి దశల వారీగా శిక్షణనిచ్చారు. నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు అవసరమైన సామాగ్రి మొదలుకొని సిబ్బంది వరకు అంతా రెడీ అయ్యారు. నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ స్థానంలో 71మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో భారీ బ్యాలెట్‌ పేపర్‌ సిద్ధం చేశారు. ఎన్నికల రోజు అవసరమైన బ్యాలెట్‌ బాక్సులను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. పోలింగ్‌కు సంబంధించిన ఓటర్‌ స్లిప్పులను ఇప్పటికే మండలాల వారీ గా పంపిణీకి సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్ట భద్రుల స్థానంలో 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ 54.5 సెంటీమీటర్ల వెడల్పు, 60.4 సెంటీమీటర్ల పొడవుతో బ్యాలెట్‌ పేపర్‌ సిద్ధమైంది. ఎన్నికల్లో ఓటర్లు ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థుల పేర్లకు ఎదురుగా నంబర్లు వేయాల్సి ఉంటుంది. ఇందుకు స్కెచ్‌ పెన్నును వినియోగిం చాలని ఈసీ నిర్ణయించింది. మైసూర్‌కు చెందిన సంస్థ తయారు చేసే ఇండెలిబుల్‌ ఇంక్‌తో కూడిన స్కెచ్‌ పెన్నులను ఆర్డర్‌ చేసి తెెప్పించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో 10,09,279 మంది ఓటర్లున్నారు. మొత్తంగా రెండు నియోజకవర్గాల్లో కలుపుకుని 1530 పోలింగ్‌ కేంద్రా లు ఏర్పాటు చేస్తున్నారు. వెయ్యికి పైగా ఓటర్లున్న చోట సహా య పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలు, ఇండిపెండెంట్లు చెమటోడ్చి ప్రచారం పూర్తిచేశారు. ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాంచందర్‌రావుల పదవీ కాలం ఈనెల 29తో ముగియ నుంది. నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల స్థానం టీఆర్‌ఎస్‌కు సిట్టింగ్‌ స్థానంగా ఉంది. ఈ స్థానంలో తిరిగి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఖరారు చేసింది. రంగారెడ్డి- హైదరాబాద్‌- మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ బీజేపి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement