Thursday, April 25, 2024

వాటే డెవలప్ మెంట్, గ్రీనరీలో హైదరాబాద్ టాప్.. పొగడ్తలతో ముంచెత్తుతున్న పర్యావరణవేత్తలు

ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్ సోలీహిమ్ హైదరాబాద్ ప్రజలకు కంగ్రాట్స్ చెప్పారు. మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం డెవలప్ చేయడంలో హైదరాబాద్‌ దేశంలోనే మొదటిస్థానంలో నిలవడం గొప్ప విషయమని ఆయన ట్వీట్ అభినందించారు. 2011, -2021 మధ్య కాలంలో జీహెచ్ ఎంసీ పరిధిలో 4,866 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. వెల్ డన్ తెలంగాణ అని ఏరిక్ సోలీహిమ్ ప్రశంసలు కురిపించారు. కాగా, ఆయన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో రీట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం ప్రోగ్రామ్ రాష్ట్రంలో మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ పథకంతో తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 63,200 హెక్టార్లలో అదనపు గ్రీనరీ పెరిగింది. దీంతో అటవీ విస్తీర్ణంలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21.47 శాతం అడవులున్నాయి. మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్‌ దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఈ పదేళ్లలో సిటీలో 4,866 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. దేశ వ్యాప్తంగా రెండేండ్లలో అటవీ విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్లు పెరుగగా, తెలంగాణలోనే 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదల నమోదుకావటం విశేషం. దేశంలో విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్‌లో,  పర్సంటేజ్ పరంగా మిజోరంలో అడవులు అధికంగా ఉన్నాయని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా- 2021 రిపోర్టులో తెలియజేసింది.

-తెలంగాణ రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. అందులో 2021 నాటికి అడవులు 26,969 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 21.47 శాతం. -2015, -21 మధ్య రాష్ట్రంలో నోటిఫైడ్‌ అడవులతోపాటు బయటి ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం 1,360 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇది 6.85 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇందులో ట్రీ కవర్‌ (చెట్ల పచ్చదనం) 361 చదరపు కిలోమీటర్లు (14.51 శాతం), ఫారెస్ట్రీ, గ్రీన్‌ కవర్‌ 1,721 చదరపు కిలోమీటర్లుగా ఉంది. -రాష్ట్రంలో 2014లో 19,854 చ.కి.మీ విస్తీర్ణంలో 19,85,400 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. -2015లో తెలంగాణకు హరితహారం ప్రారంభమైన తర్వాత 2015, -17 మధ్యకాలంలో 565 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 16,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది.

తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటడం సత్పలితాలిస్తున్నదని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారి మోహన్ చంద్ర పరిగేయిన్ అన్నారు. తెలంగాణలో 63,200 హెక్టార్ల విస్తీర్ణంలో కొత్త పచ్చదనం పెరిగిందని, పచ్చదనం పెరిగిన దేశంలోని ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ నగరం 4,866 హెక్టార్ల కొత్త పచ్చదనం వృద్ధితో దేశంలోని మెగాసిటీలో నంబర్‌ 1గా నిలిచిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement