Tuesday, March 26, 2024

హైదరాబాద్ పోలీసుల కఠిన నిర్ణయం.. మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీ జరీమానా.. జైలు కూడా

మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టీ శ్రీనివాస్ రావు తెలిపారు.కొత్త సంవత్సరం వేడుక‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్ పోలీసులు క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో డ్రంకెన్ డ్రైవ్ త‌నిఖీలు విస్తృతంగా నిర్వ‌హించ‌నున్నారు. మద్యం సేవించి బండి నడిపితే మొద‌టిసారి రూ.10 వేలు జరిమానా, 6 నెల‌లు జైలు శిక్ష‌ విధించనున్నారు. రెండోసారి దొరికితే రూ. 15 వేలు జ‌రిమానా, 2 సంవ‌త్స‌రాల శిక్ష త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. డ్రైవింగ్ లైస్సెన్స్ సీజ్ చేసి స‌స్పెన్ష‌న్‌కు ర‌వాణా శాఖ‌కు పంపుతామ‌ని చెప్పారు. మొద‌టిసారి 3 నెల‌ల స‌స్పెన్ష‌న్, రెండోసారి దొరికితే శాశ్వ‌తంగా లైసెన్స్ ర‌ద్దు అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కూడా కేసులు న‌మోదు చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement