Friday, October 4, 2024

Hyderabad – వృద్దురాలి మిస్సింగ్ .. ఆచూకీ తెలిపితే రూ.50 వేలు న‌గ‌దు బ‌హుమ‌తి….

హైదరాబాద్ బోడుప్పల్ ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న 60 ఏళ్ళ గుర్రాల లక్ష్మమ్మ ఇంటి నుంచి వాకింగ్ వెళ్లి కనబడకుండాపోయారు. ఈ ఘటన సెప్టెంబర్10వ తేదిన చోటు చేసుకుంది. వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుమారుడు గుర్రాల ఐలయ్యయాదవ్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. తమ తల్లి ఆచూకీ వీలైయినంత త్వరగా కనిపెట్టాలని పోలీసుల్ని కోరాడు. కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, తన తల్లి ఆచూకీ తెలిస్తే 9490700871 నెంబర్ కి కాల్ చేయాలని ఆచూకీ చెప్పిన వారికి 50వేల రూపాయల నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement