Saturday, April 20, 2024

ఆర్బిట్రేష‌న్ కు హైద‌రాబాద్ అనువైన ప్రాంతం : సీఎం కేసీఆర్

ఆర్బిట్రేష‌న్ కేంద్రానికి హైద‌రాబాద్ అన్నివిధాలా అనువైన ప్రాంతమ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పారు. ఈరోజు హెచ్ఐసీసీలో జ‌రిగిన IAMC స‌ద‌స్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, ప‌లువురు న్యాయ‌మూర్తులు హాజ‌రైన ఈ స‌ద‌స్సులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ (IAMC) ఏర్పాటు చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. న‌గ‌రంలో IAMC ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నందుకు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణకు ఆయ‌న త‌ర‌ఫున‌, తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున హృద‌య‌పూర్వ‌క‌ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌న్నారు. ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు కోసం ప్ర‌స్తుతం 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం కేటాయించామ‌ని, శాశ్వ‌త భ‌వ‌నం కోసం త్వ‌ర‌లో పుప్పాలగూడ‌లో భూమి కేటాయిస్తామ‌ని సీఎం తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement