Tuesday, April 16, 2024

HUZURABAD BYPOLL: ఈట‌లకు రాజకీయ సన్యాసం తప్పదన్న మంత్రి కొప్పుల‌

KARIMNAGAR: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అన్నివర్గాల సంక్షేమం కోసం ఆహర్నిషలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ కు అండ‌గా ఉండాల‌ని, హుజరాబాద్ లో గులాబీ జెండా ఎగురవేసి రుణం తీర్చుకోవాలనీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
బుధవారం క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌మ్మికుంటలో నిర్వహించిన టీఆర్ఎస్‌ రోడ్డు షోలో మాట్లాడారు. తన స్వప్రయోజనం కోసం, ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈటల రాజేంద‌ర్ బీజేపీలో చేరార‌ని విమ‌ర్శించారు. ఈనెల 30న జరుగనున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. ఎస్సీ, బీసీ, అసైన్డ్ భూములను కబ్జా చేశాడ‌ని ఆరోపణలు వచ్చిన త‌ర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈట‌ల‌ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేశార‌న్నారు. దానిపై విచారణకు ఆదేశిస్తే, ఈట‌ల తన నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి, బీజేపీతో కుమ్మక్కై, మ‌ద్యంత‌ర ఎన్నికలు తెచ్చాడని దుయ్యబట్టారు.

ఈట‌ల రాజేందర్ కు రాజకీయ ఓనమాలు నేర్పి.. రాజకీయ భవిష్యత్ అందించింది సీఎం కేసీఆర్‌ అన్నారు. సీఎంపై అసత్య ఆరోపణలు చేస్తున్నఈట‌ల‌కు ఉప ఎన్నికల్లో ప్రజలు రాజకీయ ఘోరి కట్టడం ఖాయమన్నారు. ఈ ఎన్నిక‌తో రాజకీయ సన్యాసం తప్పదనీ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు చేసిన మేలేమీలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలకు, రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముభారక్, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ ఇలా ఏదో ఒక పథకంలో తప్పక లబ్ధిదారులై ఉంటారని, ఆ విషయం గుర్తు చేసి, కేసీఆర్ రుణం తీర్చుకోవడం కోసం ఈ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటువేసి గెల్లు శ్రీనివాస్ ను భారీమెజారిటీతో గెలిపుంచాల న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement