Friday, April 19, 2024

Huzurabad Bypoll: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు  సంబంధించి ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పరిశీలించారు.  కరీంనగర్ SRR ప్రభుత్వ డిగ్రీ,  పీజీ కళాశాలలో ఏర్పాటు కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 30న జరిగే ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం ఈవీఎంలు,  వివి ప్యాట్లు భద్ర పరచడంతో పాటు నవంబర్ 2వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కోసం కళాశాలలోని ఆడిటోరియం హాల్, తరగతి గదులు, ఇండోర్ స్టేడియంను  వారు పరిశీలించారు.  కౌంటింగ్ కు  సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ కు సూచించారు. కౌంటింగ్ కోసం తగిన ఫర్నిచర్, సీసీ కెమెరాలు, బారికేడ్లు, షామియానాలు, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. SRR డిగ్రీ కళాశాల ముందు నుంచి జగిత్యాల వెళ్లే ప్రధాన రహదారిని కౌంటింగ్ రోజు ఒకపక్క మూసివేయాలని సూచించారు. కళాశాల ప్రాంగణంలోని మైదానాన్ని పరిశీలించారు.

ఇది కూడా చదవండి: నైరుతి తిరోగమనం: ఏపీలో రెండు రోజులు వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement