Sunday, October 17, 2021

హుజురాబాద్ ఉప ఎన్నిక: నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

హుజూరాబాద్‌ ఉపఎన్నిక నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈనెల 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. 13న నామినేషన్లను ఉపసంహరించేందుకు గడువు ఉంది. మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరుగుతున్నది. ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 2న ఓట్లను లెక్కించనున్నారు.

టిఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా బిజెపి తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా గా వెంకట్ బరిలో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News