Monday, October 18, 2021

బిగ్ అప్డేట్: హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 1 న హుజురాబాద్‌ నోటిఫికేషన్ విడుదల కానుండగా… నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 వరకు ఉండనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉండనుండగా… నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13 వరకు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక అక్టోబర్ 30వ తేదీన హుజురాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా… నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉండనున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ఎన్నిక సంఘం.

ఇది కూడా చదవండి: పోసానికి కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News