Sunday, January 12, 2025

House Arrest – హరీశ్‌రావు గృహ నిర్బంధం

హైదరాబాద్ – సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం ఉదయంమే కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. హరీశ్‌రావును కలవడానికి కూడా ఎవరినీ అనుమతించడం లేదు. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గురువారం ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్టులు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement