Thursday, April 25, 2024

హైకోర్టు స్టే – ఖ‌మ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు బ్రేక్ ..

ఖమ్మం : లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు.. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు హైకోర్టు బ్రేకులు వేసింది.. కృష్ణుడి రూపంలో రూపొందించిన ఈ విగ్ర‌హంపై కొంద‌రు హైకోర్టు అశ్ర‌యించారు.. భ‌విష్య‌త్ లో ఎన్టీఆర్ ను కృష్ణుడిగా భావించే అవ‌కాశం ఉన్నందున ఈ కార్య‌క్ర‌మాన్ని నిలిపివేయాల‌ని పిటిష‌న‌ర్ అభ్య‌ర్ధించారు. దీనిపై హైకోర్టు విచార‌ణ జ‌రిగింది.. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న‌న్యాయ‌మూర్తి ఈ కార్య‌క్ర‌మాన్ని నిలిపివేస్తూ స్టే మంజూరు చేశారు.. తుది తీర్పు ఇచ్చేవర‌కు స్టే కొన‌సాగుతుంద‌ని కోర్టు పేర్కొంది..కాగా, ఎన్.టీ. రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ మేర‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ కు పువ్వాడ గ‌తంలో ఆహ్వానం స్వ‌యంగా అందించారు..అయితే హై కోర్టు స్టే ఇవ్వ‌డంతో ఎన్టీఆర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement