Thursday, November 7, 2024

MDK | వనదుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు జడ్జి

  • పూల బొకేలతో ఘన స్వాగతం పలికిన జిల్లా జడ్జి, ఎస్పీ, సీనియర్ సివిల్ జడ్జి, అదనపు కలెక్టర్
  • పూజల అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించిన ఈవో
  • హరిత హోటల్లో పోలీసు గౌరవ వందనం స్వీకరించిన హైకోర్టు జడ్జి


ఉమ్మడి మెదక్ బ్యూరో : దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా ప్రసిద్ధికెక్కిన జనమేజయ సర్పయాగ స్థలిగా ప్రసిద్ధికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాతను హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఏడుపాయల ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే మెదక్ జిల్లా జడ్జి లక్ష్మీ శారద, సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, ఎస్పీ ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం హరిత హోటల్లో పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.

ఆ తరువాత ఆలయానికి చేరుకోగా ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు శంకర శర్మ, పార్థివ శర్మలు వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మెదక్ జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్, నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ అనిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్, జనరల్ సెక్రటరీ శ్రీపతిరావు, న్యాయవాదులు ప్రతాపరెడ్డి, జనార్దన్ రెడ్డి, బాలయ్య, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, చిరంజీవి, రవి గౌడ్, జిల్లా పాలన యంత్రాంగం, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పోలీస్, రెవెన్యూ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement