Tuesday, April 23, 2024

రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉత్తర బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా నిన్న (ఆదివారం) తెల్లవారు నుంచే మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చిరు జల్లలు పడుతుండడంతో ప్రజలు తడిసి ముద్దయ్యారు. రానున్న మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయం 8.30గంటల కు వాయిగుండంగా బలపడిందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని పశ్చి మబెంగాల్‌, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని, ఈ వాయిగుండం వచ్చే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పశ్చిమబెంగాల్‌ ఉత్తర ఒడిశా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండంతో ఒడి శాలో కుంభవృష్టి కురుస్తోంది. గొట్టా బ్యారేజీ నిండిపోవడం తో 32గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement