Friday, April 26, 2024

హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల‌లో భారీ వ‌ర్షం….

ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌లో ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారిపోయింది.. మార్చి నెల‌లోనే ఎండ‌లు దంచికొడుతున్న‌త‌రుణంలో నేడు ఒక్క‌సారిగా వాత‌వార‌ణ చ‌ల్ల‌బ‌డిపోయింది.. అనేక ప్రాంతాల‌లో భారీ నుంచి ఒక మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తున్నాయి.. హైద‌రాబాద్లో ద‌ట్ట‌మైన మేఘాలు క‌మ్మ‌డంతో న‌గ‌రం చీక‌టిగా మారింది.. అనేక ప్రాంతాల‌లో ఉరుముల‌తో కూడిన వ‌ర్షాలు దంచికొడుతున్నాయి.. దీంతో న‌గ‌ర‌పాల‌క సంస్థ క్రైసీస్ మేనేజ్ మెంట్ రంగంలోకి దిగింది.. వ‌ర్ష‌పునీరు రోడ్ల‌పై నిల్వ‌లేకుండా చూసేందుకు ప్ర‌త్యేక సిబ్బందిని నియ‌మించారు.. ఎల్బీ నగర్,రాజేందర్ నగర్,వికారాబాద్, సంగారెడ్డి,అత్తాపూర్, తదితర ప్రాంతాలలో వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి..

మూడు రోజులు వ‌ర్షాలే…
పెరుగుతున్న ఉష్ణో గ్రతలతో తల్లడిల్లుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరుగా, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరు పులతో కూడిన వానలతో పాటు- ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలి పింది. దీంతో ఎండ వేడిమి నుంచి కొన్ని రోజుల పాటు- ఉపశమనం లభిం చనుంది. ఆగ్నేయం, తూర్పు వైపుల నుంచి తెలంగాణ వైపుకు బలమైన గాలులు వీస్తున్నాయని, ఫలితంగా మూడు రోజుల పాటు- పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూ డా ఉందని వాతావరణ శాఖ సంచా లకులు డా.నాగరత్న తెలి పారు. ప్రకటించింది. ఉరుములు, మెరు పులతో కూడిన వాన లు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున తీరప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఉపరిత ఆవర్తనం కొనసాగుతోంది. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం నుంచి ఉత్తర-పశ్చిమ జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్త రు వర్షాలు కురుస్తున్నాయ‌ని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 16న కామారెడ్డి జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, నిజామాబాద్‌ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వాన పడే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత కరీంనగర్‌, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలులు పడతాయని పేర్కొన్నారు. పలుచోట్ల గాలి తీవ్ర త కూడా ఎక్కువగా ఉండొచ్చని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇక,ఎపిలో ఏ జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా ఉంటు-ందనే అంచనాలను కూడా ఐఎండీ వెల్లడించింది. 17, 18, 19 తేదీల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement