Thursday, April 25, 2024

హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలు వర్షాలు పడుతున్నాయి. రాజధాని హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, లక్డీకాపూల్‌, కోఠి, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, నిజాంపేటలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement