Saturday, April 20, 2024

హైదరాబాద్ ను ముంచెత్తిన వాన

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. గత రెండు రోజులుగా తెలంగాణలో లో వర్షం కురుస్తోంది. గురువారం సాయంత్రం హైదరాబాదు నగరంలో భారీ వర్షం కురిసింది. అమీర్ పేట, కూకట్ పల్లి, మాదాపూర్ , పంజాగుట్ట, ఖైరతాబాద్, ఉప్పల్, యూసుఫ్ గూడ, మల్కాజిగిరి, మల్లాపూర్, మాదాపూర్, కాప్రా, సఫిల్ గూడ, మోతీనగర్, తిరుమలగిరి, షేక్ పేట, బండ్లగూడ జాగీర్, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దాదాపు గంట సేపు ఏకబిగిన వర్షం కురియడంతో రోడ్లపై నీరు పొంగిపొర్లింది. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement