Thursday, April 18, 2024

అవగాహన లేక‌నే హార్ట్ ఎటాక్‌.. పోస్టు కొవిడ్‌ మృతుల్లో ఎక్కువగా వారే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గుండెపోటు మరణాలు రాష్ట్రంలో నిత్యకృత్యమవుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత హార్ట్‌ ఎటాక్‌తో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. పోస్ట్‌ కొవిడ్‌ సమస్యల్లో హార్ట్‌ ఫెయిల్యూర్‌ మరణాలే ఎక్కువగా ఉంటున్నాయి. గుండె పనితీరు, గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేకపోవడంతోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయని ఉస్మానియా కార్డియాలజీ విభాగం చెబుతోంది. పాతికేళ్ల ప్రాయం, నిండు యవ్వనం, రాళ్లు తిన్నా అరిగిపోయే వయస్సు… ఉజ్వల భవిష్యత్‌ ఉన్న వారు కూడా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఉన్నట్టుండి గుండెలో తీవ్రమైన నొప్పి వస్తుండడంతో ప్రాణాలు వదులుతున్నారు. కొద్ది రోజుల క్రితం కన్నడ హీరో పునీత్‌రాజ్‌ మొదలు ఈ మధ్యే ప్రాణాలు కోల్పోయిన సింగర్‌ కేకే, ప్రముఖ పాత్రికేయుడు మెండు శ్రీనివాస్‌ వరకు చిన్న వయసులోనే గుండెపోటుతో మృతిచెందుతున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది.

అవగాహన లేకపోవటంతోనే పెరుగుతున్న ముప్పు

గుండె సంబంధిత అనారోగ్యంపై ప్రజల్లో అవగాహన లేకపోవడమే గుండెపోటు మరణాలకు కారణమని హృద్రోగ వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గుండెలో నొప్పి, ఇతర ఇబ్బందులు తలెత్తిన మొదటి గంటలోనే బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తే గుండెపోటు మరణాలు చాలా వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. గుండెలో నొప్పి వచ్చిన మొదటి గంట వరకు సమయాన్ని గోల్డెన్‌ అవర్‌ అంటారని, ఆలోపు ఆసుపత్రికి తరలిస్తే 98శాతం బాధితుల ప్రాణాలు నిలుస్తాయంటున్నారు.

మారిన జీవనశైలితో గుండెపోటు

గుండె సమస్యలకు మారిన జీవనశైలి, దూమపానం, మద్యపానాన్ని ప్రధాన కారణాలుగా వై ద్యులు పేర్కొంటున్నారు. ఇవేకాకుండా రోగాలు రాగానే విపరీతంగా మందులు వాడడం, అధికంగా టీ తాగడం, వేళాపాల లేకుండా భోజనం చేయడం, అదీ కూడా ఎక్కువగా జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వంటి కారణాలు గుండె పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

- Advertisement -

ఉస్మానియా ఆసుపత్రిలో ఉచితంగా గుండె టెస్టులు…

గుండె జబ్బు ఏదైనా హృదయ స్పందనలో ఇబ్బందులు, అవంతరాలు ఎదురవడం ప్రాథమిక లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాలి. అరిక్మియా వీక్‌… ఉస్మానియా డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ కార్డియాలజీ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద ప్రజల్లో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించడంతోపాటు ఉచితంగా హార్ట్‌ టెస్టులు చేస్తాం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా జూన్‌ రెండోవారంలో హార్ట్‌ అరిక్మియా వీక్‌ను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉస్మానియా ఆసుపత్రిలోనూ నిర్వహిస్తున్నారు. చాలా ఖర్చుతో కూడుకున్న గుండె పరీక్షలను కూడా ఉస్మానియా ఆసుపత్రి కార్డియాలజీ విభాగం ఉచితంగా అందిస్తోంది. ఈసీజీ, అరి క్మియా టెస్టు, కార్డియాలజీ టెస్టులను ఉచితంగానే నిర్వహిస్తున్నారు. గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఏ వయసువారైనా గుండె సంబంధిత చిన్న అనారోగ్యం ఉన్నా వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అరిక్మియా టెస్టు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement