Wednesday, December 11, 2024

ADB | పల్లె ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం.. ఎమ్మెల్యే బొజ్జు పటేల్

జన్నారం, నవంబర్7 ( ఆంధ్రప్రభ): పల్లె ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ధర్మారం గ్రామంలో గురువారం నూతనంగా రూ.20లక్షల నిధులతో నిర్మించనున్న పల్లె దవఖాన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ప్రజారోగ్యానికి ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా పెద్దపీట వేస్తుందని ఆయన చెప్పారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశం హాలులో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదివాసీలకు 13మంది లబ్ధిదారులకు రూ.1లక్ష 95వేల చెక్కులను, మండలంలోని 50 మంది లబ్ధిదారులకు రూ.10,40,500.00 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని ఇందనపల్లిలో డీసీఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎ.టి.డబ్యూ.ఓ పురుషోత్తం, స్థానిక తహ‌సీల్దార్ రాజమనోహర్ రెడ్డి, ఎంపీడీఓ శశికళ, ఎంపీఓ జలంధర్, పొనకల్ పి.ఎ.సి.ఎస్ చైర్మన్ అల్లం రవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement