Thursday, April 25, 2024

వాగులు, గుట్టలు దాటి హెల్త్​ అసిస్టెంట్​ సాహ‌స‌యాత్ర‌.. పెనుగోలు గిరిజనులకు వైద్య సేవలు

వాజేడు (ప్రభ న్యూస్) : వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెనుగోలు గ్రామానికి వెళ్లాలంటే చాలా క‌ష్టంగా ఉంటుంది. అట్లాంటిది ఆ ఊరికి సాహ‌స యాత్ర మాదిరిగా చేసి.. గిరిజనులకు వైద్య సేవలు అందించిన హెల్త్ అసిస్టెంట్‌ని అంతా మెచ్చుకుంటున్నారు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని గుట్టలపై నివసిస్తున్న పెనుగోలు గ్రామం వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు.

ఇక‌.. లేక కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. ఆ గ్రామం చేరాలంటే మూడు వాగులు, మూడు గుట్టలు దాటాల్సి ఉంటుంది. ఉదయం బయలుదేరితే కానీ, సాయంత్రానికి ఆ గ్రామం చేరుకుంటాం. అలాంటిది విధి నిర్వహణలో భాగంగా పెనుగోలు గ్రామ హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు కాలినడకన చేరుకొని అక్కడి గిరిజనులకు రక్త పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. రెండో విడత దోమల మందు పిచికారి చేయించారు. ఆయ‌న సేవ‌ల‌పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement