Monday, October 14, 2024

AP: విధుల్లో ఉండగా గుండెపోటు … హెడ్ కానిస్టేబుల్ కన్నుమూత

తాంసి, ప్రభ న్యూస్, అక్టోబర్ 1 : విధుల్లో ఉండగానే ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలాడు. పోలీసుల వివరాల ప్రకారం… ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని బెళగం గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మచ్ఛ గంగన్న (58) మంగళవారం తాంసి పోలీసు స్టేషన్ లో విధులకు హాజరయ్యారు.

అనంతరం స్థానికంగా ఉంటున్న పోలీస్ కోటర్స్ వెళ్లి వచ్చి బయట పోలీస్ స్టేషన్ ఆవరణలో కూర్చోగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే 108కు సమాచారం అందించగా, ఆ లోపే మరణించినట్లు 108 సిబ్బంది నిర్దారించారు. కాగా అదే పోలీస్ స్టేషన్ లో తన కుమారుడు చిరంజీవి రైటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇటు పోలీస్ స్టేషన్ లో, అటు వైపు కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement