Sunday, December 8, 2024

HBD – ఇక్క‌డే ఉన్నా…మీ ఎసిబిని పంపండి – రేవంత్ కు కెటిఆర్ పిలుపు

హైద‌రాబాద్ – ఫార్ములాఈ రేస్ కుంభ‌కోణంలో ప్ర‌భుత్వం విచార‌ణ‌కు సిద్ద‌ప‌డుతున్న త‌రుణంలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే ఒక మీడియాలో బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మలేసియా పారిపోయిన‌ట్లు క‌థ‌నం రావ‌డంపై కెటిఆర్ స్పందించారు.. దీనిని ఆయ‌న ఎక్స్ ఖాతా ద్వారా ఖండించారు.. ఇదే సంద‌ర్భంలో సీఎం రేవంత్‌రెడ్డికి ట్విట్టర్‌లో బర్త్‌డే విషెస్ చెప్పిన కేటీఆర్ నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను.. మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావొచ్చు అంటూ ట్విట్ చేశారు. .. మీ బర్త్‌ డే సందర్భంగా వారితో కావాలంటే కేక్‌ కట్‌ చేయిస్తాన‌ని, . ఛాయ్‌, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తా అంటూ పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement