Friday, April 26, 2024

మంటల్లో హ‌రితాహారం మొక్క‌లు.. ఏం జ‌రిగింది..

మంటల్లో హ‌రితాహార మొక్క‌లు.. ఎం జ‌రిగింది..

ప్ర‌భ‌న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, కొందరి వ్యక్తుల నిర్లక్ష్యం హరితహారం కార్యక్రమానికి మాయనిమచ్చ తెచ్చిపెడుతుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల నుంచి జాన్‌ పహాడ్‌ వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా అధికారులు మొక్కలను నాటించారు. దాని పక్కనే దిర్శించర్ల గ్రామపంచాయితీ డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేశారు.

డంపింగ్‌ యార్డులో పారబోసిన వ్యర్థ పదార్ధాలు గాలికి చిందరపందరై ఆ ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు ఆ డంపింగ్‌ యార్డులో పోసిన వ్యర్ధలకు నిప్పు అంటించి వెళ్ళారు. గాలికి మంటలు ఎగిసిపడి హరితహారం మొక్కలకు చుట్టూ ఏర్పాటు చేసిన ట్రీగార్డులకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల కారణంగా హరితహారం మొక్కలు చాల వరకు కాలిపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement